‘మీ సేవ’ కేంద్రాల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
బూర్గంపహాడ్ మండలంలోని మీ సేవా కేంద్రాల్లో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక, నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నిర్వాహకులను ఆదేశించారు.
బూర్గంపహాడ్, జూలై 08 : బూర్గంపహాడ్ మండలంలోని మీ సేవా కేంద్రాల్లో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక, నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మీ సేవా కేంద్రాల్లో ప్రజలు ధృవపత్రాలు, ఇతర పనుల నిమిత్తం వస్తుంటారని, వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా అధికంగా రుసుము వసూలు చేస్తే అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మీ సేవా కేంద్రాలకు నిర్ణయించిన పనివేళలను తప్పనిసరిగా పాటించాలని, దరఖాస్తుదారుల నుంచి అవసరంలేని భౌతికపత్రాలు మండల రెవెన్యూ కార్యాలయాలు కోరవద్దన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రశీదుల విధానం సమర్ధవంతంగా అమలు చేయాలని, కాగితపు రశీదులకు బదులు దరఖాస్తుదారుల మొబైల్కు రశీదు సందేశం పంపించి, అవసరమైతే ఈ-ప్రింట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మీసేవాలను ఆశ్రయిస్తారని వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, డీటీ సమ్మయ్య, ఆస్ఐలు వీర్రాజు, నర్సింహారావు, మీసేవా కేంద్రం నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

