సబ్ రిజిస్ట్రార్ కోసం డబ్బులు వసూలు.. డ్రైవర్ అరెస్ట్
బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖదీర్ కోసం డబ్బులు వసూలు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఫహీంను ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మంగళవారం ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో గతంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన..
బూర్గంపహాడ్, మే 05 : బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖదీర్ కోసం డబ్బులు వసూలు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఫహీంను ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మంగళవారం ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో గతంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖదీర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీబీకి సైతం పలు ఫిర్యాదులు రావడంతో గత ఏడాది జూన్‌లో ఏసీబీ అధికారులు కార్యాలయంలో దాడులు చేసి తనిఖీలు నిర్వహించి ఫోన్ పే ద్వారా నగదు బదిలీ జరిగినట్లు గుర్తించడంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ భద్రాచలానికి బదిలీ కావడంతో సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకుని ఏసీబీ కోర్టుకు తరలించారు.
అయితే బూర్గంపహాడ్‌లో జూన్‌లో జరిగిన ఏసీబీ దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్‌కు సంబంధించిన కేసును విచారణ చేపట్టిన అధికారులు ఫోన్ పే ద్వారా నగదు బదిలీలు జరిగిన విషయాన్ని ధృవీకరించి తాజాగా ఖమ్మంలో డ్రైవర్ ఫహీంను అరెస్ట్ చేసి ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఫహీం ముందుగా తన ఖాతాలో నగదు బదిలీ చేయించుకుని ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చేవాడని విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏ అధికారైనా లంచం అడిగితే ఏసీబీ దృష్టికి తీసుకురావాలని, అలాంటి అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

