Kothagudem Urban : కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలి : కె.బ్రహ్మచారి
కార్మికులకు కనీస వేతన విధానాన్ని అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట షాప్ ఎంప్లాయీస్, పెట్రోల్ బంక్ వర్కర్స్, గ్రామ పంచాయతీ కార్మికులు, బేకరీ కార్మికులు, స్వచ్ఛమిత్ర కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్యాజువల్ కార్మికులు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రంగాల్లో రోజువారి వేతనంతో పని చేస్తున్న కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.
– 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి
– వేతనంతో కూడిన సెలవులను ప్రకటించాలి
– సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 29 : కార్మికులకు కనీస వేతన విధానాన్ని అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట షాప్ ఎంప్లాయీస్, పెట్రోల్ బంక్ వర్కర్స్, గ్రామ పంచాయతీ కార్మికులు, బేకరీ కార్మికులు, స్వచ్ఛమిత్ర కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్యాజువల్ కార్మికులు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రంగాల్లో రోజువారి వేతనంతో పని చేస్తున్న కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు అతి తక్కువ వేతనాలతో జీవితాన్ని వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత వారం రోజుల నుండి వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికుల వద్ద సమగ్ర సర్వే చేశామని ఈ సర్వేలో యాజమాన్యాలు 12 గంటలు పని చేయిస్తున్నట్లు, సరైన వేతనం ఇవ్వకుండా శ్రమను దోచుకుంటున్నాయన్నారు. కనీస సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలకు రెస్ట్ రూమ్ లు, వాష్ రూమ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తుండడంతో నెలవారి ఈఎంఐలు, అప్పులు ఎలా కట్టాలో అర్థం కాని పరిస్థితి కార్మికుల్లో నెలకొందన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేక అనారోగ్య పాలవుతున్న కార్మికులను సంబంధిత యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు.
నెలకు 30 రోజులు పని చేస్తున్నారని, ప్రతి ఆదివారం వేతనంతో కూడిన సెలవులు కూడా ఇవ్వడం లేదని, అట్టి యాజమాన్యాలపై సంబంధిత కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతో కార్మికుల శ్రమను దోచుకుంటున్న పద్ధతిపై ప్రభుత్వం, కార్మికుల శాఖ అధికారులు దృష్టి పెట్టి అట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్మిక శాఖాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డ రవి కుమార్, జిల్లా కోశాధికారి జీలకర్ర పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి కె.సత్య , జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేశ్, తాళ్లపల్లి కృష్ణ, నిమ్మల మధు, లిక్కి బాలరాజు, వివిధ రంగాల కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Kothagudem Urban : కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలి : కె.బ్రహ్మచారి
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

