‘అంతర్జాతీయ సహకార వారోత్సవాలను జయప్రదం చేయండి’
దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా కొత్తగూడెం సహకార సంఘం కార్యాలయంలో...
కొత్తగూడెం, జూన్ 29 : దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా కొత్తగూడెం సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, సహకార రంగం అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. సహకార సంఘాల బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం, దేశం అభివృద్ధిలో రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా రైతులు సహకార భావనతో ముందుకు వచ్చి సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ కె.రామచంద్రరావు, సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

