విద్యార్థులు నూరుశాతం పాఠశాలకు హాజరయ్యేలా చూడాలి : డీఈఓ వాసంతి
పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ కస్తూర్భా గాంధీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బూర్గంపహాడ్, జూన్ 29 : పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ కస్తూర్భా గాంధీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఫేస్ రికగ్నేషన్ యాప్ (ఎస్ఆర్ఎస్)లో పరిశీలించి నలుగురు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడాన్ని గుర్తించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి పాఠశాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. కొత్తగా వచ్చిన అడ్మిషన్లు పరిశీలించి ఎన్రోల్మెంట్ను ఇంకా పెంచాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి వంట సామాగ్రి, సరుకులు, వంటగది, బాత్రూమ్స్ పరిశీలించి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించిన ఆమె విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించి ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి వాటిని ఉపయోగించుకుంటూ విద్యా నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలన్నారు. పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లో గైర్హాజరు కాకుండా సక్రమంగా హాజరుకావాలన్నారు. వారం రోజుల్లో పాఠశాలను తిరిగి సందర్శిస్తానని, ఆ సమయానికి ఎవరూ గైర్హాజరు కాకుండా విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని హెచ్చరించారు. ఆమె వెంట జిల్లా ప్లానింగ్ కో-ఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

