కు.ని. ఆపరేషన్లలో బూర్గంపహాడ్ సీహెచ్‌సీ రికార్డు
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో సెంచరీతో రికార్డు సాధించింది. గత ఏడాది కాలంలో వంద కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు నిర్వహించి ఆస్పత్రి అరుదైన రికార్డు సాధించింది. 14 నుండి 15 ఏళ్లుగా ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 28 : బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో సెంచరీతో రికార్డు సాధించింది. గత ఏడాది కాలంలో వంద కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు నిర్వహించి ఆస్పత్రి అరుదైన రికార్డు సాధించింది. 14 నుండి 15 ఏళ్లుగా ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో ఆస్పత్రి ప్రాథమిక వైద్య సేవలకే పరిమితమైంది. అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ నిధులు మంజూరు చేయడంతో పాత ఆపరేషన్ థియేటర్‌ను పునరుద్ధరించి అవసరమైన పరికరాలు, శస్త్ర చికిత్స సామగ్రి సమకూర్చి తిరిగి ప్రారంభించారు. ఎమ్మెల్యే సూచన మేరకు డీసీహెచ్ఎస్ రవిబాబు ప్రత్యేక చొరవతో స్పెషాలిటీ సేవల్లో భాగంగా గైనకాలజిస్ట్‌ను నియమించారు. ఆపరేషన్ థియేటర్ ప్రారంభమైన ఏడాది వ్యవధిలో వంద కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసి బూర్గంపహాడ్ సీహెచ్‌సీ అరుదైన రికార్డు సాధించింది.
సీహెచ్‌సీ సూపరింటెండెంట్, శిశు వైద్య నిపుణులు ముక్కంటేశ్వరరావు ప్రత్యేక చొరవతో గైనకాలజిస్ట్ అనూష లక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించి సేవలను మరింత విస్తృతం చేశారు. ఈ ఆస్పత్రిలో త్వరలో స్కానింగ్ సేవలు సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీసీహెచ్ఎస్ తెలిపారు. ఆపరేషన్ థియేటర్ ఇన్చార్జి నర్సింగ్ అధికారిణి పద్మ, జ్యోతి, కరుణశ్రీ, అనురాధ, రాజకుమారి, అనూష, నీలమ్మ, కవిత రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తూ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. 100 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసి రికార్డు సాధించడం పట్ల డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, గైనకాలజిస్ట్ అనూష లక్ష్మి, వైద్య సిబ్బంది పనితీరును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

