సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
రుద్రంపూర్, జూన్ 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. సాయిని మధుసూదన్ రావు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే “రైతులకు నేస్తం” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేయనున్న కొత్త వంగడాలు, చిరుధాన్య పంటల సాగు విధానాలు, నూతన వ్యవసాయ సాంకేతికతలను తన పొలంలో అమలు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించడం జిల్లాకు గర్వకారణమని పలువురు రైతులు, వ్యవసాయ అధికారులు పేర్కొంటూ అభినందనలు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

