‘ముస్లింల సమస్యల పరిష్కారానికి బీసీ కమిషన్ హామీ’
ముస్లింలకు సంబంధించిన బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బీసీ కమిషన్ను కోరారు. ఈ మేరకు సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి..
– బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణల అంశంపై యాకూబ్ పాషా వినతి
రుద్రంపూర్, జూన్ 01 : ముస్లింలకు సంబంధించిన బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బీసీ కమిషన్ను కోరారు. ఈ మేరకు సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్య, ఉపాధి అవకాశాలను పొందేందుకు అర్హులైన ముస్లింలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొందేందుకు సరైన మార్గదర్శకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా విద్యాశాఖ రూపొందించిన ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ముస్లిం విద్యార్థుల వివరాలలో మహమ్మద్ ఇంటి పేరు గల విధ్యార్దుల నమోదుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించి భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ సమానంగా చేరేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయాలపై స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు యాకూబ్ పాషా తెలిపారు. దీంతో ముస్లిం వర్గాల్లో సమస్యల పరిష్కారంపై ఆశాభావం వ్యక్తమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాప్రోలు జై ప్రకాష్, తిరుమలగిరి సురేందర్, మైనారిటీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ వహాబ్ ఉద్దీన్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

