‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
యువతలోని నృత్య ప్రతిభను వెలికితీసేందుకు డ్యాన్స్ పోటీలు చక్కటి వేదికగా నిలుస్తాయని జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. శనివారం భద్రాద్రి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో...
– ఈ 14, 15 తేదీల్లో తెలుగు రాష్ట్రాల స్థాయి డ్యాన్స్ పోటీలు
చుంచుపల్లి, నవంబర్ 07 : యువతలోని నృత్య ప్రతిభను వెలికితీసేందుకు డ్యాన్స్ పోటీలు చక్కటి వేదికగా నిలుస్తాయని జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. శనివారం భద్రాద్రి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సీఈఆర్ క్లబ్లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న రెండు తెలుగు రాష్ట్రాల డ్యాన్స్ పోటీల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో సోలో, గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేస్తామని, కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్, నిర్వాహకుడు ప్రభురాజ్, రవికుమార్, మాలోత్ రాజా, కార్తిక్, వినయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

