ఎస్జీటీల బది‘లీలలు’
జిల్లా విద్యాశాఖలోని ఎస్జీటీల బదిలీల్లో లీలలు చోటుచేసుకుంటున్నాయి. అనేక వినతులు, పోరాటాల తరువాత అధికారులు వారిని బదిలీ చేసినప్పటికీ వారికి రిలీవ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తమ బదిలీల కోసం ఉపాధ్యాయులు అనేకసార్లు డిమాండ్లు చేశారు.
- ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ రిలీవ్ చేయడంలేదంటూ ఆరోపణలు
- రిలీవర్ల పేరుతో పాత స్థానాల్లోనే ఉంచుతున్నట్లు విమర్శలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, సంఘాల నేతలు
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 3: జిల్లా విద్యాశాఖలోని ఎస్జీటీల బదిలీల్లో లీలలు చోటుచేసుకుంటున్నాయి. అనేక వినతులు, పోరాటాల తరువాత అధికారులు వారిని బదిలీ చేసినప్పటికీ వారికి రిలీవ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తమ బదిలీల కోసం ఉపాధ్యాయులు అనేకసార్లు డిమాండ్లు చేశారు. ప్రజాప్రతినిధులకు విజ్ఞాపనలు అందించారు. కోర్టుల ద్వారా పోరాటాలు చేశారు. అవి ఫలించి అధికారులు ఎట్టకేలకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. బదిలీల ప్రక్రియను కూడా నిర్వహించారు. ఆఖరికి ఆర్డర్లు కూడా ఇచ్చారు. కానీ వాటి అమలులో కొర్రీలు పెట్టారు. దీంతో అప్పటిదాకా ఎస్జీటీల్లో ఉన్న ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆదివారం బదిలీల వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సోమవారం బదిలీల ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ ఉత్తర్వులతో రిలీవ్ అవుదామంటే నిబంధనలంటూ తిరకాసు పెట్టారు. ప్రధానోపాధ్యాయులు ఒకలా, ఎంఈవోలు మరోలా చెబుతున్నారు. దీంతో ఎస్జీటీలు గందరగోళానికి గురవుతున్నారు. బదిలీ అయినప్పటికీ రిలీవ్ చెయ్యకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
761 మందే రిలీవ్..
జిల్లాలోని ఎస్జీటీలు, పండిట్లలో 1,161 మంది బదిలీ అయ్యారు. కాగా, వీరిలో 761 మంది ఉపాధ్యాయులను మాత్రమే పాత స్కూళ్ల నుంచి రిలీవ్ చేశారు. వీరంతా తమకు నూతనంగా కేటాయింపు జరిగిన స్కూళ్లలో రిపోర్ట్ చేసి అక్కడ చేరిపోయారు. కానీ మిగిలిన 400 మందిని మాత్రం రిలీవ్ చేయలేదు. అయితే, ఇప్పటికే బదిలీ అయిన టీచర్ల స్థానంలో తదుపరి టీచర్లు వస్తేనే రిలీవ్ చేస్తామని, లేదంటే అక్కడే విధులు నిర్వహించాలని డీఈవో, ఎంఈవోలు ఆదేశిస్తున్నారు.దీంతో ఆ 400 మంది గందరగోళానికి గురవుతున్నారు. పైగా, రిలీవ్ కోసం వీరు చేస్తున్న పైరవీలతో ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది. అయితే, రిలీవ్ కాని ఉపాధ్యాయుల స్టేషన్ సీనియారిటీ పాయింట్లు నష్టపోకుండా తక్షణమే రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అత్యుత్సాహమంటూ ఆరోపణలు..
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా కొందరు ఎంఈవోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిలీవర్ అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, తప్పుడు నియమాలతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశంపై పీఆర్టీయూ నాయకులు బుధవారం డీఈవోకి ఫిర్యాదు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపి తక్షణమే వారందరినీ రిలీవ్ చేయాలని టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

