‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎర్రుపాలెం మండలంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఎర్రుపాలెం, అక్టోబర్ 09 : వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎర్రుపాలెం మండలంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పార్టీ నాయకులు కోరారు. ఎర్రుపాలెంలోని సర్దార్ జమలాపురం కేశవరావు మెమోరియల్ కళాశాల లెక్చరర్లతో పాటు ప్రజ్ఞ, ప్రతిభ పాఠశాలల ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం ఫారం-18 అందజేశారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తూ, దరఖాస్తుల నమోదుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు కీలకమని పేర్కొన్న నాయకులు మండలంలోని అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి, గడువులోగా వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా పట్టభద్రులను సంప్రదించి నమోదు ప్రక్రియను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా బృందం సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుడి దరఖాస్తు నమోదుకు కృషి చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు బొర్రా నరసింహారావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, గద్దల శ్రీనివాసరావు, షేక్ బాబు సాహెబ్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

