బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో చేపట్టేందుకు పూనుకుంది.
- పారదర్శకంగా ఉండేందుకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహణ
- రేపటి నుంచి ఈనెల 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జిల్లాలో టీచర్ల ఖాళీలు, పదోన్నతుల అర్హుల జాబితా గుర్తింపు
- కసరత్తు షురూ చేసిన విద్యాశాఖ అధికారులు
ఖమ్మం, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో చేపట్టేందుకు పూనుకుంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం, విద్యాశాఖ పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఆన్లైన్ విధానంలో పర్యవేక్షణ చేయనుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి.. ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వం వారి సమస్యలను దూర దృష్టితో ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతుండగా.. కొందరు మాత్రం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగాలని పలు రకాలుగా ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. దీనిపై అంశాలవారీగా విచారించిన న్యాయస్థానం ఆయా కేసులన్నీంటినీ కొట్టివేసింది. దీంతో బదిలీలకు సంబంధించి ఆటంకాలన్నీ తొలగిపోయాయి. కోర్టు సూచనల మేరకు విద్యాశాఖ ప్రక్రియను చేపట్టనున్నది.
షెడ్యూల్ ఇలా…
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెలువరించారు. అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుండగా.. ఈనెల 3 నుం చి 5వ తేదీ వరకు బదిలీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను విడుదల చేయాలి. పాఠశాలవారీగా ఖాళీల జాబితా వెలువరించాలి. దీంతోపాటు ఇదే తేదీల్లో దరఖాస్తు చేసిన ఆన్లైన్ కాపీలను ప్రింట్ అవుట్ తీసి వాటికి సర్టిఫికెట్లు జతపరిచి సం బంధిత ఎంఈవో, డీఈవోలకు అందజేయాలి.
- 6 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులను డీఈవో పరిశీలన చేయాలి.
- 8, 9 తేదీల్లో మార్గదర్శకాల ఆధారంగా ఉన్న బదిలీలు, పదోన్నతుల సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు. జాబితాపై అభ్యంతరాలున్న వారు ఉన్నతాధికారులకు ఆధారాల ద్వారా తెలియపర్చవచ్చు.
- 12, 13 తేదీల్లో అభ్యంతరాల అనంతరం పదోన్నతులు, బదిలీల తుది జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరుస్తుంది.
- 12, 13 తేదీల్లో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు.
- 14న ప్రధానోపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది.
- 15న ప్రధానోపాధ్యాయులకు బదిలీలతోపాటు 16న పదోన్నతుల కొరకు గ్రేడ్-2 హెచ్ఎంల ఖాళీల జాబితా విడుదల ఉంటుంది.
- 17 నుంచి 19వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 హెచ్ఎం పదోన్నతుల ప్రక్రియ నిర్వహణ.
- 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి ఖాళీల జాబితా, 23, 24 తేదీల్లో బదిలీలు ఉంటాయి.
- 26 నుంచి 28వ తేదీ వరకు ఎస్జీటీలు ఎస్ఏలుగా పదోన్నతులు పొందే ప్రక్రియ ఉంటుంది.
బదిలీలకు అర్హులు…
ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు, పీఈటీలు.. ఇలా అన్ని రకాలు వారికి బదిలీలు వర్తించనున్నారు. 2023 సెప్టెంబర్ 1 నాటికి రెండేళ్లు పూర్తయిన హైస్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సెప్టెంబర్ 1 నాటికి ఒకే స్కూల్లో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హెచ్ఎంలు, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ అవుతారు. ఉద్యోగ విరమణకు మూడేళ్లలోపు సర్వీస్ కలిగిన వారికి బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. తప్పనిసరి బదిలీలో ఉండి.. బదిలీకి దరఖాస్తు చేయని, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోని ఉపాధ్యాయులను మిగిలిపోయిన ఖాళీల్లోకి బదిలీ చేస్తారు.
సిద్ధంగా ఉన్నాం : సోమశేఖరశర్మ, డీఈవో
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. వివరాలన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. పరీశీలనతో సైతం అన్ని అంశాలపై దృష్టి సారిస్తాం. పదోన్నతులకు అర్హులైన జాబితా, ఖాళీల జాబితాను ఎంఈవోల నుంచి సేకరిస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తాం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

