ఖమ్మం మున్సిపోల్స్‌లో 57.91 శాతం ఓటింగ్ నమోదు

ఖమ్మం : శుక్రవారం జరిగిన ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్ పరిస్థితి నేపథ్యంలో ఓటింగ్‌పై భయాలు నెలకొన్నప్పటికీ ఓటర్లు బాగానే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 57.91 శాతం పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లలో నిల్చొని ఉన్నవారికి పోలింగ్ సమయం అనంతరం కూడా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. 2016లో జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 67.68 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 60 డివిజన్లకు గాను 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10వ డివిజన్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి విత్‌డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవం జరిగింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

