Road Accident | రోడ్డు ప్రమాదంలో కమ్మర్ ఖాన్ పేట యువకుడి మృతి.. మరొకరికి గాయాలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన జవ్వాజి రాధాకృష్ణ (23) అనే యువకుడు మరణించగా, అతని వెంట ఉన్న బుర్ర సాయి (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Road Accident | ధర్మారం, అక్టోబర్ 22 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన జవ్వాజి రాధాకృష్ణ (23) అనే యువకుడు మరణించగా, అతని వెంట ఉన్న బుర్ర సాయి (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరగా రాధాకృష్ణ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం ఏర్పడింది. స్థానిక ఎస్సై ఎంబడి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…కమ్మర్ ఖాన్ పేట గ్రామానికి చెందిన రాధాకృష్ణ, సాయి అనే యువకుడు కలిసి జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి ప్రదేశానికి పల్సర్ బైక్ పై బుధవారం రాత్రి వెళ్లారు. అనంతరం వారిరువురూ కలిసి అక్కడి నుంచి బైక్ పై స్వగ్రామం తిరిగి వస్తున్నారు. రాధాకృష్ణ బైక్ నడుపుతుండగా దాని వెనుక సాయి కూర్చున్నాడు. కొద్ది క్షణాల్లో ఇంటికి చేరే సమయంలోనే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
గ్రామ శివారు ఎస్సీ కాలనీ సమీపంలోని కమ్యూనిటీ హాల్ భవన సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెల్లడంతో ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాద ఘటనలో రాధాకృష్ణ తలకు బలమైన గాయమై రక్తస్రావం అయింది. మరో యువకుడు సాయి తీవ్రంగా గాయపడగా అతనిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు.
ఈ ఘటన తలకు గాయమైన రాధాకృష్ణను చికిత్స కోసం కరీంనగర్ ప్రతిమ దవాఖానకు తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో రాధాకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. కాగా జవ్వాజి కనకయ్య, అనురాధ దంపతులకు కొడుకు రాధాకృష్ణతో పాటు కూతురు ఉంది. రోడ్డు ప్రమాద ఘటనలో ఏకైక కుమారుడు రాధాకృష్ణ మరణించడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుగా రోదించారు. మృతుడి తండ్రి కనకయ్య గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

