karimnagar | ‘విలీన’ కూలీలకు భరోసా నిచ్చేనా..?
karimnagar |కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 5 : నగర పాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఉపాధి పనులు నిలిపేయగా, తమను ఆత్మీయ భరోసా పథకం ద్వారానైనా ఆదుకునేనా? లేక చేతులెత్తేసేనా అనే ఆందోళన కూలీలు వ్యక్తం చేస్తున్నారు.
- కార్పొరేషన్ లో కలిసిన సమీప గ్రామాలు
- రెండు నెలలుగా నిలిపేసిన ఉపాధి పనులు
- ఇప్పటికీ స్పష్టతనివ్వని ప్రభుత్వం
- అత్యధికులు భూమి లేని నిరుపేదలే
karimnagar |కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 5 : నగర పాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఉపాధి పనులు నిలిపేయగా, తమను ఆత్మీయ భరోసా పథకం ద్వారానైనా ఆదుకునేనా? లేక చేతులెత్తేసేనా అనే ఆందోళన కూలీలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఐదు నెలల క్రితం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు ఇచ్చేందుకు సర్వే నిర్వహించించి, భూమి లేని ఉపాధి కూలీలను అర్హులుగా గుర్తించి ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా16,565 మంది భూములేని ఉపాధి కూలీలు ఉన్నట్లు తేల్చగా, వెళ్లిన గ్రామాల్లో 8 వేలకు పైగా ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. అప్పటికి నగరంలో ఆ గ్రామాలు విలీనం కాకపోవటంతో సంబంధిత అధికారులు అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితా ప్రభుత్వానికి పంపారు.
అయితే, మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ గ్రామాల్లో మాత్రమే యంత్రాంగం పంపిణీ చేసింది.కొద్ది నెలల అనంతరం కరీంనగర్ రూరల్ పరిధిలోని బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్ గ్రామాలతో పాటు కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ చింతకుంట గ్రామాలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటివరకు ఉపాధి కూలీలకు పైలెట్ గ్రామాలు మినహా మిగతా చోట్ల ఎక్కడ కూడా ఆత్మీయ భరోసా విడుదల చేయలేదు. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఫిబ్రవరి నెల నుంచి నిలిపివేశారు.
అయితే ఆత్మీయ భరోసాపై మాత్రం ప్రకటన చేయలేదు. దీంతో, కేంద్ర నిబంధనలు కఠినంగా అమలు చేసినా, కనీసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల ఆర్థిక సాయంపై భరోసా కల్పించి, నిరుపేద కూలీల పట్ల ఆత్మీయతను చాటుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం వీలైంతమేరకు ఆత్మీయ భరోసా లబ్ధిదారులను వీలైనంతమేకు తగ్గించాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగించాలంటూ అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా వినతులు సమర్పిస్తున్నా ఆచరణలో అమలుకావడం లేదు. ఈ పరిస్థితుల్లో తమకు ఆశాభంగం మిగిల్చేనా? ఆశ నెరవేర్చేనా? అని విలీన కూలీలు ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- EGS
- Karimnagar
- Labour
- pilet project
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

