కోడి కోసం వెళ్లి కనిపించకుండాపాయె..
సమ్మక-సారలమ్మ జాతరకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
- పార్కింగ్ స్థలంలో ఇంకొకరు..వేములవాడలో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు అదృశ్యం
వేములవాడ, జనవరి 26: సమ్మక-సారలమ్మ జాతరకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 21న ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనపూర్ మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్-సరిత దంపతులు కుటుంబసమేతంగా రాజన్న సన్నిధికి వచ్చారు. మొకులు తీర్చుకున్నారు. 22న బద్ది పోచమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ మొకులు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు.
అంతలోనే కోడిని తీసుకువస్తానని వెళ్లిన శ్రీనివాస్ (45) తిరిగిరాలేదు. అప్పటి నుంచి అక్కడి పరిసర ప్రాంతాల్లో ఎంత వెదికినా జాడ దొరకలేదు. తర్వాత బంధువులు, తెలిసిన వారి ఇండ్లలోనూ ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన భార్య సరిత శుక్రవారం వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఇదే జిల్లాకు చెందిన జంగిడి గ్రామానికి చెందిన దోర్నాల సమ్మయ్య (44) కూడా రాజన్న ఆలయ పారింగ్ స్థలంలో ఈ నెల 22న అదృశ్యమైనట్టు ఆయన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

