ఎనిమిదెకరాలు.. తీరొక్క సాగు
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్.
- తక్కువ పెట్టుబడితో కూరగాయల పంటలు
- ఆదర్శంగా నిలుస్తున్న పెంబట్ల యువరైతు
సారంగాపూర్, ఫిబ్రవరి 11 : తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్. 9 ఏండ్లుగా తనకున్న 8 ఎకరాల్లో సీజనల్‌గా వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. కూరలిసంద, క్యాబేజీ, కాలీఫ్లవర్, కాకర, సోర, బీర, స్వీట్‌కార్న్, చిక్కుడు, బటానీ, వంకాయ, నువ్వు పంటలు సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం 10 గుంటల్లో కూరలిసంద, 5 గుంటల్లో కాలిఫ్లవర్, 10 గుంటల్లో వంకాయ, 20 గుంటల్లో బెండకాయ, అంతరపంట కింద కశ్మీర్ రెడ్ ఆఫిల్ బేర్, రెండెకరాల్లో కరబూజ సాగు చేశాడు. ఏటా సీజన్‌కు అనుగుణంగా రసాయన ఎరువులు వాడకుండా డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.
కూరగాయలతో అధిక లాభం
ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా వివిధ రకాల కూరగాయల సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుంది. నాకున్న ఎనిమిదెకరాల్లో కొంత భూమి ఖాళీగా ఉంచుతూ మిగతా భూమిలో విడుతల వారీగా వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నా. పండించిన కూరగాయలను జగిత్యాలతోపాటు వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నా. కష్టపడి పనిచేస్తున్నందుకు ఫలితం దక్కుతున్నది. ఆసక్తి ఉన్న రైతులు నా భూమిని సందర్శిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వివిధ పంటల సాగుపై అవగాహన కల్పిస్తా.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

