కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ : చెట్లన్నీ చిగురించే వేళ.. పూల పరిమళాలు వెదజల్లే వేళ.. లేలేత చివుళ్లు మేసి, కోయిలమ్మలు కుహు కుహూ రాగాలు తీస్తున్న వేళ.. వచ్చేది వసంతం! ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం! ఈ రుతువు ఆగమనంతో తెలుగు కొత్త సంవత్సరం ఉగాది ఆరంభమమవుతుంది.
శోభకృత్ నామ సంవత్సరం ముగిసి.. నేటి నుంచి క్రోధి నామ సంవత్సరం మొదలవుతున్నది.