గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, డీసీపీలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
- పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దు
- టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష
కమాన్చౌరస్తా, మే 18: జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, డీసీపీలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) లక్ష్మీనారాయణ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని పేరొన్నారు. తగిన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్ ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. కలెక్టర్లు పోలీస్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయా పరీక్ష కేంద్రాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్ హెడ్ క్వార్టర్లలో తగిన బందోబస్తు మధ్య ఉంచాలని పేరొన్నారు. పరీక్ష కేంద్రాలకు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లాలని, పరీక్ష కంటే ముందు ఇన్ టైంలో చేరేలా చూడాలని సూచించారు. జూన్ 9న 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలని, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.
అభ్యర్థులు ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీ జరుగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. రీజినల్ కోఆర్డినేటర్స్ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష ముగిసే సమయం వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని పేరొన్నారు.
జిల్లాలో 18,663 మంది అభ్యర్థులు..
కరీంనగర్లో గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు 36 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రూప్-1 పరీక్ష ఏర్పాట్లపై వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 18,663 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. మే 22న హైదరాబాద్లో బయోమెట్రిక్ పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ నోడల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
టీఎస్ పీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష జరిగేలా చూడాలని తెలిపారు. దివ్యాంగులు, అంధ అభ్యర్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో పవన్ కుమార్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) లక్ష్మీనారాయణ, జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ప్రొఫెసర్ బీ సతీశ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీ చరణ్, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, రజినీ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

