‘బండి’ ఖబడ్దార్
సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బండి సంజయ్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని మరిచి బీజేపీ అధిష్టానం మెప్పు కోసం చెప్పులు మోశాడని ఎద్దేవా చేశారు
- సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు
- సంజయ్ పాదయాత్ర ఏటీఎం యాత్ర
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు
కార్పొరేషన్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బండి సంజయ్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని మరిచి బీజేపీ అధిష్టానం మెప్పు కోసం చెప్పులు మోశాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, రాష్ర్టానికి ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయన్న విషయం కూడా బండి సంజయ్‌కి తెలియదన్నారు. ఎన్నికల్లో కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎంతో మంది ఆర్థిక నేరస్తుల నుంచి రూ. కోట్ల కమీషన్లు పుచ్చుకొని దేశం నుంచి పారిపోయేలా సహకరించినందుకు ఢిల్లీకి పాదయాత్ర చేయాలన్నారు. జీఎస్టీ కింద రావాల్సిన నిధులను రాష్ర్టానికి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
వరంగల్ సభలో బండి సంజయ్ ఎంత సేపు సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే తప్ప తాను చేసిన పాదయాత్రలో అనుభవాలను కూడా చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. పాదయాత్రలో సుందరమైన రోడ్లు, హరితహారం చెట్లు, ప్రజలకు అందిస్తున్న తాగునీరు, కరెంటులోనూ సీఎం కేసీఆర్ కనిపించడంతో అక్కసుతోనే తప్పుడు విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ చేతుల్లో సీబీఐ, ఈడీలు ఉన్నాయని, సీఎం కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారని తేల్చి చెప్పారు. మీ ఈడీలకు, సీబీఐలకు తెలంగాణ నాయకులు, ప్రజలు భయపడేది లేదన్నారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తే లక్షలాది మంది వెళ్లి సంఘీభావం తెలుపుతున్నారని, ఇంకా దాడులు చేయాలని చూస్తే ప్రజలే తరిమికొడుతారని హెచ్చరించారు. కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలన్న ఆలోచన బండి సంజయ్‌కి లేదని దుయ్యబట్టారు. బండి చేస్తున్న పాదయాత్రను ఏటీఎం యాత్రగా మార్చారని, కేవలం తన లబ్ధికోసమే చేస్తున్నాడని విమర్శించారు. పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్, సుడా సలహా కమిటీ సభ్యులు చీటి రాజేందర్రావు, ఉదారపు మారుతి, తోట మధు, వంగర రవి, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్, నాయకులు వొడ్నాల రాజు, నారదాసు వసంత్‌రావు, గందె కల్పన, ఇఫ్తేకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

