Collector B Satya Prasad | విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్
రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు కలెక్టర్ బీ సత్యప్రసాద్ రాయికల్ మండలంలోని జగన్నాథ్ పూర్, ఒడ్డె లింగాపూర్ గ్రామాల్లోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Collector B Satya Prasad | జగిత్యాల, సెప్టెంబర్ 29 : రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు కలెక్టర్ బీ సత్యప్రసాద్ రాయికల్ మండలంలోని జగన్నాథ్ పూర్, ఒడ్డె లింగాపూర్ గ్రామాల్లోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాఠశాలల నిర్వహణ, ఆహారం, పారిశుధ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వంటశాలల పరిస్థితులను పరిశీలించి, అవసరమైన చోట ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, మౌలిక వసతుల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన దుప్పట్లు, ఇతర వసతులను ముందుగానే సమకూర్చాలని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవనాల్లో అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు. అనంతరం ఉప్పుమడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి నెలలోపు భవన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పీ నరేష్, జిల్లా విద్యాశాఖ అధికారి కే రాము, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో నాగార్జున, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

