Home
Karimnagar
Top Former Maoist Leaders Visited The Family Members Of The Deceased In Ramaiyapalle
Ramagiri | రామయ్యపల్లెలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు
రామయ్యపల్లె (బుధవారం పేట) గ్రామానికి చెందిన మాజీ పీపుల్స్ వార్ నాయకుడైన అరెల్లి కొమురయ్య గౌడ్ తల్లి గట్టుమల్లు ఇటీవల మృతి చెందడంతో పలువురు మాజీ మావోయిస్టు అగ్రనేతలు మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Ramagiri | రామగిరి, నవంబర్ 10 : రామయ్యపల్లె (బుధవారం పేట) గ్రామానికి చెందిన మాజీ పీపుల్స్ వార్ నాయకుడైన అరెల్లి కొమురయ్య గౌడ్ తల్లి గట్టుమల్లు ఇటీవల మృతి చెందడంతో పలువురు మాజీ మావోయిస్టు అగ్రనేతలు మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (సత్తన్న), సికాస వ్యవస్థాపకుడు హుస్సేన్ అలియాస్ శంకరన్న తదితరులు రామయ్యపల్లెకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలు ఆరెల్లి గట్టుమల్లు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దీంతో గ్రామంలో కొంతసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తూ నేతలు ఓదార్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

