Godavarikhani | బూడిద మాఫియాలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ పాత్ర.. ఆర్ఎస్సీఎల్ కార్మిక సంఘం నేత నరేష్
రామగుండం నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీతో ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ బూడిద మాఫియాలో భాగస్వామ్యమై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘ నేత అంబటి నరేష్ ఆరోపించారు.
Godavarikhani | గోదావరిఖని : రామగుండం నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీతో ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ బూడిద మాఫియాలో భాగస్వామ్యమై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘ నేత అంబటి నరేష్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో బహిరంగంగా జరుగుతున్న బూడిద మాఫియా కుంభకోణాన్ని ప్రశ్నించిన వారిపై ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారని ఆరోపించారు. ఎవ్వరూ బూడిద గురించి మాట్లాడినా వాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్ల లారీలను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయల ఫైన్లు రాపిస్తూ, ఈ బూడిద మొత్తానికి సిండికేట్ మాఫియా నాదే అని ఎమ్మెల్యే, ఆయనతో పాటు వారి అనుచరగణం పోలీసులను రవాణా శాఖ అధికారులను పెట్టించి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నేషనల్ హైవే టెండర్లు, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే టెండర్లు, ఆ రోడ్డుకు NH-365, 163, వాటికి ఇక్కడి నుంచి నేషనల్ హైవే పర్మిట్ తీసుకున్నటువంటి బూడిద లారీలు, రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల లోడు, అయితే 200 లారీలు, 100 లారీలు అక్కడికి పోయి అన్లోడ్ చేస్తారని మిగతా 100 లారీలు అమ్ముకుంటున్నారని విమర్శించారు.
10,000 టన్నుల కంటే ఒక్క టన్నుకు రూ.900లతోటి NTPC, MOF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రకారం వాళ్లు టన్నుకు రూ.900 లోడ్ చేసి ఖమ్మం దాకా పంపిస్తుంటే, ఇక్కడ జాతీయ ధనాన్ని NTPC కేంద్ర ప్రభుత్వం యొక్క సొమ్ము, ప్రజల సొమ్మును ఇట్లా ముంచుకుంటూ, అదే లారీని అమ్ముకుంటూ, మళ్లా లారీకి రూ.30 నుండి రూ.40 వేల చొప్పున అమ్ముకుంటూ, ఒక్క లారీ మీద డబుల్ ఇన్కమ్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే. ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంటా, ఈ కోట్ల రూపాయల పైసలు అమాయకమైనటువంటి ఇక్కడ లారీ డ్రైవర్లను, ఓనర్లను ముంచి, ఇక్కడ అసోసియేషన్‌నే లేకుండా చేసి, ఆయన ఏక చిత్రాధిపత్యంగా ఈ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. NTPC నుంచి ఒక రూపాయికి టన్ను వచ్చేటువంటి బూడిదను ఆయన రూ.6,500 ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు.
ఎన్టీపీసీ యజమాన్యం టన్నుకు రూపాయి చొప్పున ఇస్తున్న బూడిదను వేలాది రూపాయలతో అమ్ముకుంటూ ఇప్పటికే కోట్లు గడించిన మక్కాన్‌సింగ్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాదులో త్రిబుల్ ఆర్ రోడ్డుకు సైతం బూడిద సరఫరా చేసిందేకు ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ బూడిద దందాను ఎవరు ప్రశ్నించిన వారిపై దాడులు బెదిరింపులు జరుగుతున్నాయని ఈరోజు ప్రెస్ మీట్ కు వస్తానన్న వాళ్లు కూడా భయపడి రాలేదని నన్ను ఏం చేసినా నిజాలు చెప్తానని లారీ ఓనర్లకు డ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

