శభాష్.. గంగాధర్!
“శభాష్.. గంగాధర్. రోడ్లు పాడవకుండా ప్రతి ఒక్కరూ నీలా ఆలోచించాలి” అంటూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కేజ్‌వీల్స్ కింద తాకకుండా తీసుకెళ్తున్న ట్రాక్టర్ యజమానిని రోడ్డుపై ఆపి అభినందించారు.
- కేజ్‌వీల్స్ కింద తాకకుండా తీసుకెళ్లిన ట్రాక్టర్ యజమాని
- అభినందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్పల్లి రూరల్, ఆగస్టు 11: “శభాష్.. గంగాధర్. రోడ్లు పాడవకుండా ప్రతి ఒక్కరూ నీలా ఆలోచించాలి” అంటూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కేజ్‌వీల్స్ కింద తాకకుండా తీసుకెళ్తున్న ట్రాక్టర్ యజమానిని రోడ్డుపై ఆపి అభినందించారు.
మెట్పల్లి మండలం రామారావుపల్లెకు చెందిన విలాసాగర్ గంగాధర్ ట్రాక్టర్ నడుపుకుంటూ ఉపాధి పొందుతుండగా, నెల రోజులుగా తన ట్రాక్టర్‌కు కేజ్‌వీల్ వేసి పొలం దుక్కులు దున్నుతున్నాడు. అయితే, కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్‌ను రోడ్డు దాటించే క్రమంలో రోడ్డు చెడిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాడు.
తన కేజ్‌వీల్ ట్రాక్టర్ వెనకాల హైడ్రాలిక్ పట్టీలకు మరో ట్రాక్టర్ హైడ్రాలిక్ పట్టీలతో అటాచ్ చేశాడు. టైర్లతో ఉన్న ట్రాక్టర్ హైడ్రాలిక్ పట్టీలను పైకి లేపి తన ట్రాక్టర్ కేజ్‌వీల్స్‌ను రోడ్డుకు తగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. ఇలాగే ఆదివారం రోడ్డుపై వెళ్తుండగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి సదరు ట్రాక్టర్ యజమానితో మాట్లాడారు.
సామాజిక బాధ్యతతో రోడ్డు చెడిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నదుకు గంగాధర్‌ను అభినందించారు. నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో సుమారు రూ.500 కోట్లతో రోడ్లను బాగు చేసుకున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

