మన గురుకులాలు దేశానికే ఆదర్శం
కార్పొరేట్‌కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో జరిగిన ‘స్వచ్ఛ గురుకుల’ కార్యక్రమానికి హాజరయ్యారు
- కార్పొరేట్‌కు దీటుగా బోధన
- జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ
- ఇతర రాష్ర్టాలు అధ్యయనం చేసే స్థాయిలో అద్భుత ఫలితాలు
- మంత్రి కొప్పుల ఈశ్వర్
- మల్లాపూర్ గురుకుల స్కూల్లో మొక్కలు నాటిన అమాత్యుడు
- విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం
ధర్మారం, సెప్టెంబర్ 9: కార్పొరేట్‌కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో జరిగిన ‘స్వచ్ఛ గురుకుల’ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యాలయ ఆవరణలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుకులాల ఆర్సీవో అనంత లక్ష్మి, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడారు. స్వరాష్ట్రంలో గురుకుల స్కూళ్లకు వన్నె తెచ్చామని, నేడు ప్రతి విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే స్థాయిలో బోధన జరుగుతున్నదని వివరించారు.
విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభచూపుతున్నారని, ఇందుకు సుమారు 150కి పైగా ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించడమే నిదర్శమని చెప్పారు. ఉత్తమ ఫలితాలతో ఇతర రాష్ర్టాలు మన గురుకుల విద్యావిధానంపై అధ్యయన చేసే స్థాయికి చేరామని చెప్పారు. గురుకులాల్లో వంద శాతం ఫలితాల సాధనకు బోధన సిబ్బంది విద్యార్థులను దత్తత తీసుకోవాలని సూచించారు. గతేడాది ఇంటర్, పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. మల్లాపూర్ గురుకులంలో చదివి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించిన ధర్మారం ఎంపీడీవో జయశీలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు, పెయింటింగ్‌లను ఆయన పరిశీలించారు.
విద్యాలయంలో పచ్చ గరకతో తయారు చేసిన స్వచ్ఛ గురుకులం చిత్రపటంతో పాటు ముగ్గును పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సమావేశానికి ప్రిన్సిపాల్ గిరిజ అధ్యక్షత వహించగా గురుకులాల ఆర్సీవో అనంత లక్ష్మి, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్ నోముల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గంధం వరలక్ష్మి -నారాయణ, ఎంపీటీసీ భూక్య సరిత-రాజు, ఎంపీడీవో భీమ జయశీల, తాసిల్దార్ రేవెల్లి వెంకట లక్ష్మి, ఎంపీవో రమేశ్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు మల్లేశం ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

