Dharmaram | జాతీయ మూల్యాంకనంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థానం సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
జాతీయ స్థాయిలో నిర్వహించే పరాక్ మూల్యాంకనంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థానం సాధించేలా ఉపాధ్యాయులందరూ సమష్టిగా కృషి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
- విద్యార్థులను ముందస్తు ప్రణాళికతో జాతీయ స్థాయి మూల్యాంకనానికి సిద్ధం చేయాలి
- రచ్చపల్లి పీఎస్ హెచ్ఎం డాక్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు రూపొందించిన పరక్ అభ్యసన దీపికను ఆవిష్కరించిన కలెక్టర్
Dharmaram | ధర్మారం, నవంబర్ 11 : జాతీయ స్థాయిలో నిర్వహించే పరాక్ మూల్యాంకనంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థానం సాధించేలా ఉపాధ్యాయులందరూ సమష్టిగా కృషి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ డాక్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు రూపొందించిన ‘పరాక్ అభ్యసన దీపిక’ పుస్తకాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ షేక్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షల సమయంలో మాత్రమే కాకుండా ముందుగానే జాతీయ స్థాయి మూల్యాంకనానికి సిద్ధం చేయాలని సూచించారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అనుసరించాలని, ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో మూడో తరగతి స్థాయిలో ఎదుర్కోనున్న పరక్ మూల్యాంకనాన్ని దృష్టిలో పెట్టుకొని రచ్చపల్లి ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక అభ్యసన మాడ్యూల్‌ను రూపొందించారు. కేంద్ర స్థాయి అభ్యసన ప్రమాణాలు, పాఠ్యాంశాలతో పాటు గత రెండు సంవత్సరాల ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులకు కొంత క్లిష్టంగా ఉండే 25 ముఖ్యమైన అంశాలను ఎంపిక చేశారు. ప్రతీ అంశానికి సంబంధించి 20 నుంచి 25 ప్రశ్నల చొప్పున స్వయంగా రూపొందించి వందలాది ప్రశ్నలతో ప్రత్యేక అభ్యసన దీపికను సిద్ధం చేశారు.
విశేషమేమిటంటే, ఈ అభ్యసన దీపికను తన సొంత నిధులతో హెచ్ఎం వంశీ మోహన ఆచార్యులు ముద్రించి ప్రతీ విద్యార్థికి వ్యక్తిగతంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు జాతీయ స్థాయి మూల్యాంకనంలో వారు ఆత్మవిశ్వాసంతో రాణించేలా ఈ వినూత్న ప్రయత్నం చేపట్టారు. గత విద్యా సంవత్సరంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా రెండో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఎంపికైన పాఠశాలల్లో రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ప్రత్యేక కార్యాచరణ, నిరంతర అభ్యాసం, ప్రణాళికాబద్ధమైన బోధనతో విద్యార్థులు మంచి ప్రతిభ కనభరిచారు. అదే స్ఫూర్తితో పరక్ జాతీయ మూల్యాంకనంలోనూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక అభ్యసన దీపికను రూపొందించారు.
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక అభ్యసన మాడ్యూల్‌ను రూపొందించి, తన సొంత నిధులతో ముద్రించి విద్యార్థులకు అందిస్తున్న రచ్చపల్లి ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యుల కృషి అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా జాతీయ స్థాయి మూల్యాంకనాల్లో అత్యుత్తమ ప్రతిభ కనభరిచేలా ఉపాధ్యాయులందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పీఎం షేక్, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

