Kolanur | సుల్తానాబాద్ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ లో కొలనూర్ విద్యార్థుల ప్రతిభ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామ హై స్కూల్ విద్యార్థులు డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ లో తమ ప్రతిభను చాటారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన డివిజనల్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) క్రీడా పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొలనూరు విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
Kolanur | ఓదెల, సెప్టెంబర్ 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామ హై స్కూల్ విద్యార్థులు డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ లో తమ ప్రతిభను చాటారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన డివిజనల్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) క్రీడా పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొలనూరు విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో ఈ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిట్టూరి యేసుదాసు, గ్రామ సర్పంచ్ పల్లె కనకయ్య, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి అభినందించారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. క్రీడల ద్వారా గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇందుకు తమ వంతు సహాయ, సహకారాలు ఉంటాయని సర్పంచ్ కనకయ్య తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

