VEMULAWAD | కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
VEMULAWAD | వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 :రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- బాల నగర్, చెక్కపల్లి, మల్లారం లో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
- హాజరైన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
VEMULAWAD | వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 :రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలో బాల నగర్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారం లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా తల్లులను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కొనుగులు కేంద్రాలను వారికి కేటాయించారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు,మేలైన వంగడాలను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రైతు ప్రయోజనాలు కోసం రూ.21 వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు అదనంగా రూ. 500 ఇస్తున్నదని తెలిపారు. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్, అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా జిల్లా లో ఇప్పటి వరకు 35 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పలిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు.
రైతులు పండించిన పంట చివరి గింజా వరకు కొంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ రజిత,జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెట్ కమిటీ, ఫ్యాక్స్ ఛైర్మెన్ లు రోండి రాజు, ఏనుగు తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Adi Srinivas
- PACS
- PADI
- Siricilla
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

