Table tennis competitions | రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు సుల్తానాబాద్ ఐపీఎస్ విద్యార్థులు
పెద్దపల్లి జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
Table tennis competitions | సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 27 : పెద్దపల్లి జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ఈ నెల 15న జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ పోటీలలో పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల 20 మంది విద్యార్థులు 13,15,19 సంవత్సరాల బాల బాలికల విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి ఎంపికైన క్రీడాకారులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 28 తేదీ నుండి 30 వరకు హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, శివ, సతీష్, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

