KTR | తెలంగాణ భవన్లో విద్యార్థినిని అభినందించి, అండగా ఉంటానని భరోసా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
KTR | హైదరాబాద్/సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం వంశికను కలిసిన ఆయన, ఆమెను ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంశిక క్రికెట్లో సాధించిన విజయాలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తీరు, భవిష్యత్తు లక్ష్యాల గురించి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వంశికకు అన్ని విధాలా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతో కూడిన ఉమ్మడి జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె, తన నాయకత్వ ప్రతిభతో జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంది. వచ్చే నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక తెలంగాణ తరఫున తన ప్రతిభను చాటనుంది. గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుకుంటూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలతో పాటు నామాపూర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. వంశిక సాధించిన విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు కుంట శ్రీనివాస్‌ను, ఆమెకు ప్రోత్సాహం అందించిన పాఠశాల ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ వంశిక విజయాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Karimnagar
- KTR
- musthabad
- namapur
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

