Rajanna temple | రాజన్న ఆలయ ఉద్యోగులకు ఉద్వాసనకు రంగం సిద్ధం.. ప్రకటన జారీ చేసిన అధికారులు
వేములవాడ రాజన్న ఆలయంలోని రెగ్యులర్ ఉద్యోగులు నలుగురికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత ఏదైనా అనివార్య కారణాలతో విధులకు హాజరు కాకపోతే శాఖపరమైన విచారణ జరిపిన తర్వాతే ఉద్వాసన చేయాల్సి ఉంది.
- వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Rajanna temple | వేములవాడ, నవంబర్ 27 : వేములవాడ రాజన్న ఆలయంలోని రెగ్యులర్ ఉద్యోగులు నలుగురికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత ఏదైనా అనివార్య కారణాలతో విధులకు హాజరు కాకపోతే శాఖపరమైన విచారణ జరిపిన తర్వాతే ఉద్వాసన చేయాల్సి ఉంది. కాగా, రాజన్న ఆలయ అధికారులు పేపర్ లో నోటీసు ప్రకటన జారీ చేసి వారం రోజులలో వివరణ ఇవ్వాలని కోరడం ఆలయ ఉద్యోగ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
వేములవాడ రాజన్న ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు రాజేష్ 2019 ఉద్యోగం పొందగా, యశ్వంత్ 2021 లో ఉద్యోగంలో చేరాడు. స్వీపర్ గా విధులు నిర్వహించిన సత్యనారాయణ, సీనియర్ అర్చకులుగా ఉన్న బ్రహ్మయ్యతో పాటు నలుగురు ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఇందులో ఇద్దరు ఇప్పటికే రాజేష్ తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. మరో ఉద్యోగి బ్రహ్మయ్య కూడా వీఆర్ఎస్ తీసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక మిగిలిన ఇద్దరు ఉద్యోగులు కూడా తమ విధులకు హాజరయ్యేందుకు పలుమార్లు సంప్రదించినట్లు కూడా సమాచారం ఉంది. అయితే రెగ్యులర్ ఉద్యోగులుగా సదరు ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినట్లుగా తెలిసింది. నోటీసులు అందుకున్న ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చినప్పటికీ సంతృప్తిగా లేదని అధికారులు తిరస్కరించినట్లు సమాచారం.
ప్రకటన జారీ చేసిన అధికారులు..
వేములవాడ రాజన్న ఆలయంలో నలుగురు ఉద్యోగులను తొలగించేందుకు గురువారం ప్రముఖ దినపత్రికలో ప్రకటన జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రకటన జారీ చేసిన వారం రోజులలో సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. సంజాయిషీ ఇవ్వని ఎడల ఇదే ప్రకటనను ఆధారంగా చేసుకొని ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగంలో నుండి తొలగిస్తామని పేర్కొన్నారు. ఇద్దరు ఉద్యోగులు తమకు ఉద్యోగం వద్దని ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా మరో ఇద్దరు ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రకటన జారీ చేయడం వెనుక అధికారుల తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్చకుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా తాను వీఆర్ఎస్ కోరుతున్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎళ్ల తరబడి విధులు నిర్వహించినప్పటికీ శాఖపరమైన రావాల్సిన సహాయాన్ని అందకుండా చేసేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖపరమైన విచారణ జరిపిన తర్వాతే ఉద్యోగాల నుండి తొలగించాల్సి ఉండగా కేవలం ప్రకటన ద్వారా మాత్రమే ఎలా తొలగిస్తారనే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సదరు ఉద్యోగులకు డిసెంబర్ 2 వరకు గడువు విధించగా మానవతా కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆలయ ఉద్యోగుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

