Godavarikhani | గోదావరిఖనిలో స్ఫూర్తి సభ.. అలుగునూరు దీక్షా దివస్ సభకు తరలిన గులాబీ శ్రేణులు
కరీంనగర్ పట్టణంలోని అలుగునూర్‌లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం తరళివెళ్లారు. ఈ సందర్భంగా ముందుగా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి సభ నిర్వహించారు.
Godavarikhani | గోదావరిఖని : కరీంనగర్ పట్టణంలోని అలుగునూర్‌లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం తరళివెళ్లారు. ఈ సందర్భంగా ముందుగా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి సభ నిర్వహించారు. 29 నవంబర్ 2009న ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్ స్ఫూర్తిని తెలియజేసే ఉద్దేశంతో డిసెంబర్ 1న కరీంనగర్ పట్టణంలోని అలుగునూర్ నుంచి హైదరాబాదులోని అమర జ్యోతి వరకు డిసెంబర్ 1న తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రకటిస్తూ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, వ్యాల హరీష్ రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజి రెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
దీక్షా దివస్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పాదయాత్ర : కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆనాడు చేపట్టిన అమరణ నిరాహార దీక్ష స్ఫూర్తిని తెలియజేయడానికి తెలంగాణ ఉద్యమకారుడిగా డిసెంబర్ 1న కరీంనగర్ అలుగునూర్ నుంచి హైదరాబాదులోని అమర జ్యోతి వరకు పాదయాత్ర చేసేందుకు నిర్ణయించాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి తనతో పాటు ఎంతోమంది ఉద్యమకారులు రాష్ట్ర సాధన కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడిలు బెదిరింపులు ఎన్ని వచ్చిన వాటన్నిటిని తిప్పికొడుతూ ఉద్యమ బాట పట్టాం. కరీంనగర్ లో జరుగుతున్న దీక్షా దివస్ కు పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలి వెళ్లడం సంతోషంగా ఉంది. డిసెంబర్ 1న తలపెట్టిన పాదయాత్రలో ఉద్యమకారులతోపాటు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే స్వరాష్ట్రం సాకారం : కౌశిక్ హరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్ అమరణ దీక్ష మైలు రాయిగా నిలిచింది. ఆరోగ్యం సహకరించకున్న లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడమో..? లేదా కేసీఆర్ చావడమో..? అనే నినాదంతో 29 నవంబర్ 2009లో జరిగిన దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు మమేకమై స్ఫూర్తిని చాటుతూ పోరాటం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి రామగుండం కేంద్ర బిందువు : వ్యాల్ల హరీష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రామగుండం సింగరేణి కార్మికులు కేంద్ర బిందువుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ ఇచ్చిన పిలుపును సింగరేణి కార్మికులు స్వీకరించి సకల జనుల సమ్మెలో పాల్గొని స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అక్కరకు రాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల్లోనే వాళ్ల మోసాన్ని తెలియజేసింది. కాంగ్రెస్ మోసాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

