LMD | తిమ్మాపూర్, సెప్టెంబర్ 25 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయానికి స్వల్ప ఇన్ ఫ్లో వస్తున్నది. మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతిమ్మెద వాగు, ఇతర వాగుల నుండి 5వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతున్నది.
వాగుల ద్వారా 3వేలు, మిడ్ మానేరు నుండి రెండు వేల క్యూసెక్కుల వరద ఎల్ ఎండీ లోకి వస్తున్నాయి. 24.034 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండీలో ప్రస్తుతం 11.629 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వర్షాలు కొనసాగితే మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.