పర్యాటక కేంద్రంగా సింగరేణి
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అద్భుతమైన పర్యాటక కేంద్రమని సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ అన్నారు.
- ఖనిజ సంపదతో దేశానికి వెలుగులు
- ఆర్టీసీ సహకారం అభినందనీయం
- సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్
యైటింక్లయిన్‌కాలనీ డిసెంబర్ 28: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అద్భుతమైన పర్యాటక కేంద్రమని సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ అన్నారు. ఆర్జీ-2 ఏరియాలోని మూసివేసిన 7ఎల్ఈపీ గనిని యాజమాన్యం పర్యాటక కేంద్రంగా మార్చగా, బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. ముందుగా సంస్థ పరిధిలోని బొగ్గు నిక్షేపాలు, భూగర్భ గనులు, ఓసీపీల్లో పని స్థలాలు, బొగ్గు ఉత్పత్తికి వినియోగిస్తున్న భారీ యంత్రాలు, మ్యాన్‌రైడింగ్ తదితర నమూనాలను పర్యాటకులతో కలిసి వీక్షించారు. ఆర్టీసీ, సింగరేణి జాయింట్ ప్రాజెక్టుగా మొదటిసారిగా 7ఎల్ఈపీ గనిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్మికులు గనుల్లోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికి తీసి దేశానికి వెలుగులందిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థ గురించి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మూసివేసిన గనిని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని చెప్పారు. పర్యటకులకు భూగర్భ గనుల్లో కార్మికులు బొగ్గు వెలికి తీసే విధానంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ నుంచి కోల్ టూరిజం పేరిట బస్సులను నడుపుతున్నదని చెప్పారు. టూరిస్టులకు 7ఎల్ఈపీ గని, ఓసీపీ-3 ప్రాజెక్టు, జైపూర్ పవర్ ప్లాంటును సందర్శించేందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9:30 గంటలకు కరీంనగర్‌కు చేరుకున్న కోల్‌టూరిజం బస్సుకు కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం చందర్రావు, డిపో-2 మేనేజర్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, అధికారుల సంఘం ప్రతినిధి చంద్రమౌళి, ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం ఖుష్రోషా ఖాన్, ఆర్జీ-1 జీఎం కాల్వల నారాయణ, కార్పొరేట్ జీఎం గురువయ్య, రీజియన్ జీఎం సాంబయ్య, వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, గ్రూప్ ఏజెంట్ కాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఓటు జీఎం అబ్దుల్ సలీం, ఓసీపీ-3 పీఓ మోహన్ రెడ్డి, డీజీఎం(ప) జీ. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కొత్త అనుభూతి కలిగింది..
సింగరేణి ప్రాంతం అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన, కానీ సింగరేణి టూరిజం కొత్త అనుభూతిని కలిగించింది. ఇంతటి అద్భుతమైన ప్రాంతాన్ని చూసే అవకాశం రావడం అదృష్టం. సింగరేణి కార్మికులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోలిగిన.
-అరుణ, హైదరాబాద్
కార్మికులకు సెల్యూట్…
భూగర్భంలోకి వెళ్లి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న సింగరేణి కార్మికులకు నా సెల్యూట్. వారి శ్రమ వెల కట్టలేనిది. మొదటిసారిగా సింగరేణి బావిలోకి దిగడం జీవితంలోనే మరచిపోలేను. బావిలోకి దిగుతున్నప్పుడు కలిగిన అనుభూతి చెప్పలేనిది. తెలంగాణలో ఇంతటి అద్భుత ప్రదేశం ఉండడం మన అదృష్టం.
-అభినయ్, హైదరాబాద్
వేరే లోకానికి వెళ్లినట్లు ఉంది…
బావిలోకి దిగాక వేరే లోకానికి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. మొదటగా కొంత భయపడ్డ. అక్కడి వెళ్లి పని స్థలాలు, యంత్రాలు చూశాక భయం పోయి సంతోషమనిపించింది. సింగరేణి, ఆర్టీసీ జాయింట్ ప్రాజెక్టుగా కోల్ టూరిజం ఏర్పాటు చేయడం సంతోషదాయ కం. ఇంతటి అద్భుతమైన స్థలాలను చూసిన అనుభూతిని స్నేహితులతో పంచుకుంట.
-మహబూబ్ ఆలీ, హైదరాబాద్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Singareni
- tourist center
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

