Thimmapur | తిమ్మాపూర్‌లో ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసాంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ రహదారిపై ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
- పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు
Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 29 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసాంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ రహదారిపై ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద చర్యలు చేపట్టారు. మండలంలోనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఒక్క నిమిషం.. చేజారిన పరీక్ష
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో వారిని లోపలికి పోలీసులు అనుమతించలేదు. జగిత్యాలకు చెందిన అభ్యర్థి, మరో సెంటర్ లో ఇద్దరు అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనందున పరీక్షకు అనుమతించాలని వేడుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు వెనుతిరిగారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
పరీక్షా కేంద్రాలను సీపీ గౌస్ ఆలం పర్యవేక్షించారు. పలు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలకు అనుమతించామని, అభ్యర్థులు పరీక్ష రాసిన అనంతరం రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు చేపట్టామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. ఈ పరీక్షలకు 7228 మంది అభ్యర్థులకు గాను 6714 మంది అభ్యర్థులు హాజరయ్యారు 431 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

