She team | మహిళల రక్షణ, భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయి.. షీ టీం మెంబర్ స్నేహలత
మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీంలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
She team | అంతర్గాం , జూలై 17 : మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీంలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ.. మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు.
మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ ,ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా మప్టీలో ఉంచడం జరుగుతుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి ఎకంబరం షీ టీం సభ్యులు మౌనిక, సురేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

