Madaram Thanda | సారంగాపూర్, ఫిబ్రవరి 22: సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా గ్రామంలో ఆదివారం బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287 జయంతి భోగి బండార్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతు సేవాలాల్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దురాచారాలను అపోహలను ఆశాస్త్రీయమైన అపోహలను నమ్ముతు జీవిస్తున్న బంజారా జాతులను తన ఆలోచనలు ప్రసంగాలతో చైతన్యపర్చిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అని గిరిజనులు సంతు సేవాలాల్ సేవలను స్మరించుకున్నారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భుక్య భారతి చిరంజీవి, ట్రాన్స్ కో ఏడీఈ భుక్య జవహార్ లాల్ నాయక్, ఉప సర్పంచ్ గుగులోతు కిషన్, గ్రామ కార్యదర్శి రవి, గిరిజన నాయకులు, బంజార యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.