Join BRS | వేములవాడ రూరల్, డిసెంబర్ 26: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఉపసర్పంచ్ బెజగం మహేష్, 10వ వార్డు సభ్యుడు బాణాల రాజు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీనీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా లక్ష్మీనరసింహారావు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రుద్రవరం ఉప సర్పంచ్ బెజగం మహేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని, అలాగే వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చల్మెడ తోనే జరుగుతుందని వారు తెలిపారు. అందుకే పార్టీలోకి చేరినట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, వార్డు సభ్యులు అలిపిరి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు హరికృష్ణ, సీనియర్ నాయకులు కట్ట తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.