Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 10 : చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధిలోని పెద్దమ్మ పల్లె పోచమ్మ గుడి వద్ద చేతిపంపు నెల రోజులుగా పనిచేయకపోవడంతో ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలుమార్లు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండల స్థాయి అధికారులైన స్పందించి నీటి సమస్య లేకుండా పరిష్కరించి చేతిపంపు రిపేర్ చేయాలని కోరుతున్నారు.