స్కాలర్షిప్ వచ్చేదెన్నడు?
పేద పిల్లల చదువుకు సర్కారు ప్రోత్సాహం కరువవుతున్నది. ఉపకారం వేతనం అందకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఈ విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఇప్పటికీ స్కాలర్షిప్పులు, రీయింబర్స్మెంట్ రాకపోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
- రీయింబర్స్మెంట్ కోసమూ ఎదురుచూపే
- ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలు
- పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని చెప్పి మోసం
- కరీంనగర్ జిల్లాలో 150 కోట్లకు పైగా పెండింగ్
- ఆర్థిక శాఖ టేబుల్‌పై మూలుగుతున్న ఫైళ్లు
- విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిడి
- చేతులెత్తేస్తున్న సంక్షేమ శాఖలు
- చోద్యం చూస్తున్న పాలకులు
పేద పిల్లల చదువుకు సర్కారు ప్రోత్సాహం కరువవుతున్నది. ఉపకారం వేతనం అందకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఈ విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఇప్పటికీ స్కాలర్షిప్పులు, రీయింబర్స్మెంట్ రాకపోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలో 150 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై యాజమాన్యాల ఒత్తిడి పెరుగుతున్నది. ఫలితంగా కొందరికి ఎదురుచూపులే మిగిలిపోగా, మరికొందరు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయినా చోద్యం చూస్తున్న అధికారులు, పాలకుల తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, మే 31: పేద, మధ్య తరగతి కుటుంబాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు అందాల్సిన బోధనా రుసుంలు, ఉపకార వేతనాల కోసం ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నా, విద్యార్థుల చదువుపై పెట్టుబడి పెట్టేందుకు నిర్లక్ష్యం చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన విద్యాసంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించి 150 కోట్ల వరకు పెండింగ్‌లో ఉంది. రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల వివరాలు సంక్షేమ శాఖలు సకాలంలోనే అందించినా, ఆర్థిక శాఖ టేబుల్‌పై ఫైళ్లు నిద్రపోతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫైళ్ల క్లియరెన్స్, నిధుల విడుదలపై ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
విద్యార్థులపై ఒత్తిడి
స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ కోట్లాది రూపాయలు పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిడి రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. ముందుగా చెల్లించి, నిధులు విడుదలైన అనంతరం తిరిగి తీసుకోవాలంటూ చెబుతుండడంతో ఆందోళన నెలకొంది. ప్రభుత్వమే బోధనా రుసుంలు చెల్లిస్తుందనే ధీమాతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు సర్కారు తీరుతో తల్లడిల్లుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి బోధన ఫీజులు చెల్లిస్తుండగా, ప్రభుత్వం విడుదల చేస్తే తమ ఖాతాల్లో జమ అయిన అనంతరమైనా తమకు చెల్లిస్తారో లేదోననే అనుమానం విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ హామీ బట్టుదాఖలేనా..?
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని విస్మరించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకొచ్చి ఆరునెలలు కావస్తున్నా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు 54 వేల వరకు స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వీరందరికీ రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉండగా, పరీక్షలకు ముందే యాజమాన్యాలు ఒత్తిడి తేగా, హామీ పత్రాలు రాసిచ్చి, పరీక్షలకు హాజరైనట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వెల్లడవుతుండడం, పై చదువుల కోసం సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉండడంతో ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఇప్పటి నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫీజుల చెల్లింపులపై ఫోన్ల ద్వారా హెచ్చరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోడ్ ముగియగానే విద్యార్థుల రీఎంబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల మొత్తం విడుదల చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

