Gold Medal | అర్చరీలో గురి తప్పని రమేష్.. రాష్ట్రస్థాయిలో స్వర్ణ పతకం కైవసం
ఖాకీ దుస్తుల్లో విధి నిర్వహణ.. క్రీడా మైదానంలో లక్ష్యంపై గురి.. ఈ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఎం రమేష్ అర్చరీలో స్వర్ణ పతకాన్ని సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు.
- 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో బంగారు పతకం
- గతంలో రజతం, కాంస్య పతకాలతో సత్తా.. ఈసారి అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు
Gold Medal | కమాన్ పూర్, నవంబర్ 27 : ఖాకీ దుస్తుల్లో విధి నిర్వహణ.. క్రీడా మైదానంలో లక్ష్యంపై గురి.. ఈ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఎం రమేష్ అర్చరీలో స్వర్ణ పతకాన్ని సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. నిజామాబాద్‌లో జరుగుతున్న 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 రాష్ట్రస్థాయి పోటీల్లో విలువిద్య విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రామగుండం కమిషనరేట్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు. విలువిద్యలో విజయం సాధించాలంటే ఏకాగ్రత, నైపుణ్యం, సహనం కీలకం. ఈ లక్షణాలను తన ప్రదర్శనలో ప్రతిబింబించిన రమేష్ పోటీల్లో తన గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ కమిషనరేట్లు, విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొంటున్న ఈ క్రీడా సమరంలో తన ప్రతిభతో ప్రత్యేకంగా నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు.
ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రమేష్‌కు అర్చరీలో ఇది మరో మైలురాయి. గతంలోనూ పోలీస్ క్రీడా పోటీల్లో రజత, కాంస్య పతకాలు సాధించి తన ప్రతిభ చాటారు. ఈసారి స్వర్ణ పతకంతో అగ్రస్థానాన్ని అందుకున్నారు. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత పట్టుదలతో సాధన కొనసాగించడం ద్వారా ఈ ఘనత సాధించారు. విధి నిర్వహణకు ప్రాధాన్యమిస్తూనే క్రీడలపైనా ఆసక్తి, అంకితభావంతో ముందుకు సాగుతున్న రమేష్ విజయం పోలీస్ సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది. ఆయన సాధించిన స్వర్ణ పతకంపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని పతకాలు సాధించి రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు, పోలీస్ శాఖకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Archery
- gold medal
- Kamanpur
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

