Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
Sircilla | సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sircilla | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 23: సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఉదయం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పద్మశాలి మహిళలు అమ్మవారికి సమర్పించేందుకు ఒడిబియ్యాన్ని సిద్ధం చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారితో పాటు లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పద్మావతి అమ్మవారిని పద్మశాలి ఇంటి ఆడపడుచుగా భావించి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి కులబాంధవులు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మంది పద్మశాలి కులబాంధవులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బొల్లి రామ్మోహన్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ గాజుల బాలయ్య, మోర రవి, సహాయ కార్యదర్శి దూడం శ్రీనివాస్, కోశాధికారి యేళ్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, మహిళా విభాగం అధ్యక్షురాలు కాముని వనిత, కౌన్సిలర్ అడిచర్ల రూప సాయికృష్ణ, దార్ణం అరుణ లక్ష్మీనారాయణ, మామిడాల మహేష్, ఆడెపు చంద్రకళ ప్రభాకర్, కూరపాటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం పెద్దలు, పుర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

