అక్షరాలా అరలక్ష
- రాజన్న సన్నిధికి 50వేలకుపైగా భక్తజనం
- శ్రావణ సోమవారం ఆలయంలో రద్దీ
- ఒక్కరోజే 24లక్షల ఆదాయం
వేములవాడ టౌన్, ఆగస్టు 8: శ్రావణమాసం.. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవా రం కావడంతో వేములవాడ రాజన్న సన్నిధి పోటెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా 50వేలకు పైగా భక్తులు తరలిరావడంతో ఎటు చూసినా సందడి కనిపించింది. ఉదయం నుంచే తాకిడి మొ దలు కాగా, భక్తులు మొదట పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం పార్వతీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. కల్యాణకట్టలో తలనీలా లు సమర్పించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జితసేవలు, అభిషేక, అన్న, ఆకుల పూజలను రద్దు చేశారు. భీమేశ్వర, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయాల్లో స్వామి, అమ్మవార్ల ను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఏఈవోలు శ్రీనివాస్, నవీన్, పర్యవేక్షకులు నాగుల మహేశ్, తిరుపతిరావు, ఆలయ ఇన్స్పెక్టర్లు చెక్కిళ్ల అశోక్, సంకేపల్లి పవన్‌కుమార్ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఒక్కరోజే రాజన్నకు సుమారు 24లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటేశ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

