సహకార సంఘాల ద్వారా రైతుల ఆర్థిక అభివృద్ధి : ఎమ్మెల్యే చెన్నమనేని
ఎమ్మెల్యే చెన్నమనేని | సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందుతారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు.

రాజన్న సిరిసిల్ల : సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందుతారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ మండలంలోని శాత్రాజ్ పల్లి, చెక్కపల్లి గ్రామాల్లో రూ. 45 లక్షలతో సహకార సంఘం గోదాం భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు కరెంట్, సాగునీరు లేక బాధపడితే నేడు వడ్లు ఆరబోసుకుందాం అంటే జాగ లేని పరిస్థితి వచ్చిందన్నారు.
ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసమే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎల్లంపల్లి సాగునీరు ద్వారా పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, రైతులు కూడా పంట మార్పిడి ద్వారా మార్కెట్ని అనుసరించి లాభాలు ఆర్జించే పంటలు వేయాలని కోరారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాండ్లు, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

