పానీపూరీ తయారీ కేంద్రాలపై దాడులు.. నిల్వ ఉంచిన పదార్థాలు స్వాధీనం
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పానీపూరీ తయారీ కేంద్రాలపై మున్సిపల్, ఫుడ్ సేప్టీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ పట్టణం, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో పానీపూరి తయారీ, పరిశుభ్రత ప్రమాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
సిరిసిల్ల టౌన్, జూన్19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పానీపూరీ తయారీ కేంద్రాలపై మున్సిపల్, ఫుడ్ సేప్టీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ పట్టణం, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో పానీపూరి తయారీ, పరిశుభ్రత ప్రమాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖాదీర్‌పాషా మాట్లాడుతూ.. పలు తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన పానీపూరీలు, ఫంగస్ పట్టిన ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పరిశుభ్రత, ప్రమాణాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, విక్రయాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై జరిమానాలు విధిస్తామన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత ప్రధాన లక్ష్యమని, ఆహార భద్రత ప్రమాణాల అమలులో రాజీపడమని స్పష్టం చేశారు. నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఇక్కడ ఫుడ్ సేప్టీ అధికారి అనూష, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

