బీపీపీలో మొక్కలను త్వరితగతిన నాటాలి : గరిమాఅగర్వాల్

రామడుగు: బృహత్ పల్లెప్రకృతి వనం( బీపీపీ)లో మొక్కలను త్వరితగతిన నాటాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని దేశరాజ్‌పల్లిలో పదెకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతివనాన్ని పరిశీలించి, ఇప్పటివరకు ఎన్ని మొక్కలను నాటారని అధికారులను అడుగగా 12 వేల మొక్కలను నాటినట్లు వారు తెలిపారు. మిగతా మొక్కలను త్వరగా నాటాలన్నారు. సమీపంలో నిర్మించిన తడి, పొడి చెత్త యూనిట్‌ను పరిశీలించారు.
అనంతరం షానగర్ చేరుకొని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించి, గ్రామంలో ఇప్పటివరకు ఎంతమందికి కొవిడ్ టీకాను పంపిణీ చేశారని ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్‌రావు, దేశరాజ్‌పల్లి సర్పంచు కోల రమేష్, ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, పీఆర్ ఏఈ సచిన్, ఏపీవో రాజు, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

