Gas Cylinders | కమాన్ పూర్, మార్చి 28 : కమాన్ పూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు క్యూలైన్లో బారులు తీరారు. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉంటుందనే వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద ప్రతి నిత్యం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందవద్దని చెబుతున్నప్పటికి కమాన్పూర్ మండలంలో మాత్రం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పట్టించుకోవట్లేదు.
దీంతో గ్యాస్ సిలిండర్ల సమస్య మండి గట్టెక్కేందుకు వినియోగదారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి నెలకుంది. కమాన్పూర్ గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్దకు ప్రతి నిత్యం గృహ వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలిరావటం.. వారిని నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకోవడం పరిపాటిగా మారింది. ఇలా ఇంకెన్నీ రోజులు గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలైన్లో నిలుచోవల్సి ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ల సరఫరా గృహ వినియోగదారులకు సరఫరా ప్రక్రియ నిలిచిపోయింది.
దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు తరలివస్తున్నారని యదావిధిగా మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని గృహా వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా ప్రక్రియను పునరుద్దరించి క్యూలైన్ వెతలు తొలిగించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.