Suicide | అడవిశ్రీరాంపూర్లో అదనపు కట్నం కోసం గర్భిణీ బలి
అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న హృదయవిధార ఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవిశ్రీరంపూర్ గ్రామానికి చెందిన పాండవుల స్వామి, భాగ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Suicide | ముత్తారం: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న హృదయవిధార ఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవిశ్రీరంపూర్ గ్రామానికి చెందిన పాండవుల స్వామి, భాగ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలి (21)ని భూపాలపల్లి జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్తో ఈ ఏడాది మార్చి 10 న వివాహం జరిపించారు.. కట్నం కింద రూ.లక్ష, ఎకరం పొలం ఇచ్చారు. ప్రస్తుతం అంజలి ఆరునెలల గర్భిణీ.
వివాహం జరిగినప్పటినుంచే అదనపు కట్నం కోసం అంజలికి అత్తింట్లో వేధింపులు, భర్తతో గొడవలు మొదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక దసరా పండగకి తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. గురువారం వెంకటేశ్ అంజలిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులతో వచ్చి మాట్లాడాడు. మళ్లీ అత్తింటికి వెళ్లడం ఇష్టంలేని అంజలి అదేరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ రాజు, ముత్తారం ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

