Praja Vani | కరీంనగర్లో పేలవంగా ప్రజావాణి..!.. మధ్యాహ్నం దాకా పత్తా లేని అధికారులు
ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల గైర్హాజరు, అర్జీదారుల పలుచని హాజరుతో పేలవంగా సాగింది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కార్యక్రమంలోనే అధికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపించింది.
- కలెక్టర్ రాకతోనే కదలిక.. బోసిపోయిన ఆడిటోరియం
Praja Vani | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 19 : ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల గైర్హాజరు, అర్జీదారుల పలుచని హాజరుతో పేలవంగా సాగింది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కార్యక్రమంలోనే అధికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపించింది. ఐడీఓసీలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఇందుకు వేదికైంది. తెలంగాణ పూల పండుగ సద్దుల బతుకమ్మ మరుసటి రోజు, మంగళవారం దసరా పండుగ నేపథ్యంలో ప్రజావాణికి అర్జీదారుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. పండుగ వాతావరణం కారణంగా ప్రజలు పెద్దగా రాకపోవడం ఒక కారణమైతే, వచ్చిన కొద్దిమందికి కూడా కార్యక్రమం ఆశించిన స్థాయిలో సాగకపోవడం గమనార్హం. నిర్దేశించిన సమయానికి ప్రజావాణి ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంతో వేదికపై తహసీల్దార్ స్థాయి అధికారులే కనిపించారు.
ప్రజల సమస్యలను వినేందుకు, అర్జీలను స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నతాధికారుల గైర్హాజరు చర్చనీయాంశమైంది. వచ్చిన కొద్దిమంది అర్జీదారులు సైతం తమ సమస్యలను వివరించేందుకు, దరఖాస్తులు అందించేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆడిటోరియం సందడి లేక బోసిపోయింది.
అదనపు కలెక్టర్ ఆలస్యంగా వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. అర్జీల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులు, సిబ్బందిలో కొందరు సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ కనిపించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాల్సిన చోట ఇలాంటి దృశ్యాలు కనిపించడం కార్యక్రమ నిర్వహణ తీరుపై ప్రశ్నలు రేకెత్తించింది.
కలెక్టర్ రాగానే హడావుడి!
మధ్యాహ్నం 12.30 గంటల అనంతరం కలెక్టర్ రావడంతో ఒక్కసారిగా అధికారుల్లో కదలిక మొదలైంది. అర్జీదారులు కూడా తమ దరఖాస్తులతో క్యూలో నిలబడటం కనిపించింది. అప్పటివరకు కనిపించని హడావుడి కలెక్టర్ రాకతో మొదలవటం పట్ల అర్జీదారులు మండిపడ్డారు. ప్రజావాణి అనేది కేవలం సోమవారం నిర్వహించే కార్యక్రమం మాత్రమే కాదు.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యతాయుత వేదిక. అలాంటి కార్యక్రమంలో అధికారులు సమయపాలన పాటించకపోతే, ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ప్రజలకు న్యాయం జరిగేదెలా? ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సిబ్బంది బాధ్యతాయుత పనితీరు ఉంటేనే ప్రజావాణికి సార్థకత చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

