కరీంనగర్ కలెక్టర్కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల విరాళం

కరీంనగర్ : కొవిడ్ రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్కు చెందిన కార్వా కుటుంబం జిల్లా కలెక్టర్ కె.శశాంక కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా అందజేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లతో సహా ప్రభుత్వ ఆసుపత్రులలో వీటిని ఉపయోగించాల్సిందిగా కోరింది. దాతలు, పారిశ్రామికవేత్తలు భగవాన్వాన్ కార్వా, కృష్ణ కార్వా, కార్తీక్ కార్వా చైనా నుండి దిగుమతి చేసుకున్న రూ. 7 లక్షల విలువైన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కలెక్టర్కు తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త కేసరిమల్ కార్వా జ్ఞాపకార్థం వీటిని అందించినట్లు తెలిపారు.
కొవిడ్ రోగుల ప్రాణాలను కాపాడేందుకు కార్వా కుటుంబం చేసిన ఈ దానాన్ని కలెక్టర్ ప్రశంసించారు. కొవిడ్ కేర్ సెంటర్లలో వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. మహమ్మారి నుండి తలెత్తే సంక్షోభాన్ని పరిష్కరించడంలో దాతలు ముందుకు రావాల్సిందిగా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భగవాన్దాస్ కార్వా మాట్లాడుతూ.. కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను దానం చేసినట్లు తెలిపారు. కొవిడ్పై పోరాటంలో ప్రభుత్వానికి మరింత మద్దతు ఇస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

